నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు.
Also read :భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో గత పది రోజులుగా విచారణ కొనసాగింది. ఆరుగురు కార్పొరేటర్లు, మేయర్ భర్త జయవర్ధన్, ఉద్యోగులపై దర్యాప్తు సాగింది. ఇందులో 70 దస్త్రాలకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.
Also read :Kidney Cheating: కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!
Andhra Pardesh: మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్