April 11, 2025
SGSTV NEWS
Andhra Pradesh

అనిత : పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్

Andhrapradesh: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఏం పగులగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి.

అమరావతి, జూలై 4: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఏం పగులగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి జగన్ రూ.25 లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్ళారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని హెలికాఫ్టర్‌లో వెళ్లి మరీ పరామర్శించారన్నారు.

Also read :భారీగా చౌక బియ్యం పట్టివేత

ములాఖత్‌లు ముగిసిన తర్వాత కూడా మానవతా ధృక్పధంతో జగన్‌కు అనుమతి ఇచ్చామన్ని చెప్పుకొచ్చారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికే అని మండిపడ్డారు. జైలు నుంచి బయటకొచ్చిన జగన్ ఏదేదో మాట్లాడారన్నారు. ములాఖాత్‌లపై జైళ్ల ఐజీ నుంచి కూడా నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు. తనపైప కూడా గత ప్రభుత్వం అట్రాసిటీ కేసులు పెట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేస్తామని తెలిపారు. న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు

Also read :Kurnool: బాలికపై లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Related posts

Share via