ఆమె నిత్య పెళ్లి కూతురు. అయితే ఆమెను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమయ్యారు అధికారులు. కాగా,
ఒకప్పుడు అమ్మాయిల్ని టార్గెట్ చేసే వాళ్లు అబ్బాయిలు. ప్రేమ పేరుతో వలలో వేసుకుని, తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్ని రోజులు కాపురం చేశాక, ఆమె దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుని పరారయ్యేవారు. మరో ప్రాంతానికి వెళ్లి పేరు మార్చుకుని మరో యువతిని ఏమార్చి.. వివాహం చేసుకునే వారు. అక్కడ కూడా అదే వ్యవహారం సాగించేవారు. అలా ఇద్దరు, ముగ్గురు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిల్ని చీట్ చేసిన ఎంతో మంది నిత్య పెళ్లి కొడుకుల్ని పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు మోసం చేయడంలో అబ్బాయిలే కాదు.. యువతులు కూడా ఆరు ఆకులు ఎక్కువే చదువుకున్నారు. వాళ్లు కూడా నిత్య పెళ్లి కూతుర్లుగా మారి యువకుల్ని చీట్ చేస్తున్న సంగతి విదితమే.
Also read :వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి
తాజాగా యువకుల్ని మోసం చేస్తున్న నిత్యపెళ్లి కూతుర్ని గత నెలలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంగా ఆమె కోసం వెతుకుతుండగా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వెనుక పెద్ద ముఠానే ఉందని గుర్తించారు. ముజఫర్ నగర్ జైలుకు తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె చేతిలో వంచనకు గురైన యువకులు కోసం వెతుకులాడుతున్నారు. ఆమెతో శారీరకంగా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ముజఫర్ జైలు సూపరింటెండెంట్ సీతారామ్ శర్మ మాట్లాడుతూ.. నిందితురాల్ని జైలుకు తీసుకు వచ్చాక వైద్య పరీక్షల్లో HIV పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు.
Also read :పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు
ప్రస్తుతం ఆమెకు యాంటీ వైరల్ థెరపీ తీసుకుంటోంది. కాగా, ఈ ప్రకటనతో రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ఆమెతో శారీరక సంబంధాలను పెట్టుకున్న కుర్రాళ్లు సైతం వణికిపోతున్నారు. ఆమె ఉత్తరాఖండ్, యుపీలోని యువకులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముగ్గురు యువకులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. యువతి, తల్లితో సహా ఏడుగురు సభ్యులు ఈ ముఠాలో భాగమని, ఇప్పటి వరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో తేలింది. కానీ పోలీసులు ఈ సంఖ్య ఎక్కువే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇతర బాధితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, నిందితురాలికి 20 ఏళ్లు ఉంటాయని, ఆమె ఉత్తరాఖండ్ నివాసిగా నిర్దారించారు పోలీసులు. అలాగే గుర్తించిన ముగ్గురు బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేపట్టగా.. ముగ్గురికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందట
Also read :AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం