ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్ధుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.
అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.
Also read పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు
ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు
Also read అధిక లాభాలు ఆశ .. గోల్డ్ ట్రేడింగ్లో మోసపోయిన 500మంది బాధితులు
విమాననగర్లో వింత వింత శబ్దాలు.. అర్థరాత్రి రోడ్లపైకి జనం.. జరిగిందిదే..