నిడదవోలు మండలం సమిశ్ర గూడెం శివారు లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఐ.యఫ్.టి.యు బృందం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ 80 % వ్యవసాయ దేశమైన భారత దేశం లో పెట్టుబడి దారుల ప్రాపకం కోసం యాంత్రీకరణ పేరిట వ్యవసాయ రంగంలోని దుక్కి దున్ను, నారుమడి, కలుపుతీత, పంట కోత, నూర్పిడి తదితర పనులనుండి నెట్టివేయబడ్డ వ్యవసాయ కూలీ ల ను ఆదుకునేందుకు కేంద్రం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు కుంచించుకు పోతున్నాయని, ఇటీవల రాజకీయ నాయకుల కుర్చీలాటగా మారిన ఎన్నికల పేరుతో 2024 మే 11వ తేది నుండి నేటి వరకూ కూలీ చెల్లింపులు నిలిపి వేసి ఉపాధి కూలీలను ఆర్థిక ఇక్కట్లకు గురి చేస్తున్నారనీ తక్షణమే పెండింగ్ లో వున్న కూలి చెల్లించటమేకాక దినసరి వేతనం మరియు పని దినాల పెంపుదలకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు, యాప్ ల కారణంగా శివారు ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఫొటోలు అప్లోడ్ కాకపోవటం వల్ల పనులకు ఆటంకం గా వున్నందున తక్షణమే యాప్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Also read జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు గెడ్డం రవీంద్ర బాబు, రాచర్ల సువర్ణ రత్నం, రూతు, మేరీ, ఉందుర్తి దీపికా, దిద్దే నాని బాబు, పసలపూడి రామకృష్ణ, శ్రావణి, తాడిపూడి వెంకటేష్ తదితరులు నాయకత్వం వహించారు.