SGSTV NEWS
Crime

పేగు బంధానికి అడ్డుగా గోడ.. ప్రేమించిన పాపానికి తన పైత్యాన్ని చూపిన తండ్రి..

తల్లిదండ్రులకి ఇష్టం లేకపొయిన పొరుగింటి యువకుడుని పెళ్ళి చేసుకుందని కూతురుపై‌ కోపం పెంచుకున్నారు తల్లిదండ్రులు. వారి‌ఇంటికి దారి లేకుండా చేసి‌ సిసి రోడ్డుపై‌ సిమెంటు ఇటుకతో గోడకట్టేసారు. గ్రామ పెద్దలు చెప్పినా వినకపోవడంతో ఈ పంచాయతీ కాస్తా కూతురు ఫిర్యాదుతో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కరీంనగర్ జిల్లా ‌శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన మమత తన ఇంటి ప్రక్కనే రత్నాకర్ ప్రేమించుకున్నారు. మమత తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి ఒప్పుకోక‌పోవడంతో మమత రత్నాకర్ లు 2013 పిబ్రవరి 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అయిన కేశవపట్నంలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్నారు. రత్నాకర్, మమత తల్లిదండ్రులు మాత్రం వీరి ప్రేమ వివాహం కారణంగా ఎడమొఖం,పెడమొఖంగానే ఉంటున్నారు. మమత ఇంటి ముందునుండే రత్నాకర్‌ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది.

 

రత్నాకర్‌ కుటుంబం తమ‌ ఇంటి ముందు నుండి నడువకుండా సిసి రోడ్డుపైనా అడ్డంగా‌ సిమెంట్ ఇటుకలతో గొడ‌కట్టారు. ఇంటికి వెళ్ళడానికి దారి‌ లేకుండంతో మమత తన తల్లిదండ్రులపై‌ చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. అయితే మమత తండ్రి సంపత్ మాత్రం తమకి భూమి విషయంలో‌ పంచాయతీ‌ ఉందని, ఆ పంచాయతీ తేలే వరకు గొడ తీసేది లేదని చెబుతున్నాడు. గ్రామంలో‌ని రహదారి సిసి రోడ్డు అందరూ కలిసి వాడుకొవాలని, అడ్డంగా నిబంధనలకు విరుద్ధంగా గొడ ఎలా కడుతారని గ్రామ కార్యదర్శి రవి చెబుతున్నారు. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి రహదారిని పరిశీలించారు. మొత్తానికి తమకి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకున్న కుతురు కుటుంబం ఇప్పుడు దొడ్డిదారి గుండా ఇంటికి పోవాల్సి వస్తుంది.

 

Related posts

Share this