78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు*
విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సాయిరాం నగర్ లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ యొక్క ఆవరణములో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి 8 గంటలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన 67వ వార్డు కార్పొరేటర్ గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు చే పతాకావిష్కరణ చేయగా, పెదగంట్యాడ పీహెచ్సీ డాక్టర్ పి హేమలత చే బాపూజీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు, ఈ సభకు స్వామి విద్యానికేతన్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు అధ్యక్షత వహించారు, విశాఖ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీ తుంపాల శ్రీరామ్ మూర్తి మూర్తి చే వివిధ రకాల ఆటలలో మరియు వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు, బిజెపి నాయకులు బాటా శ్రీనివాసరావు దేశభక్తి గీతాలు పాడి విద్యార్థులకు వినిపించారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గూటూరు శంకర్రావు విద్యార్థులు ఉద్దేశించి మిగతా అతిధులతో పాటు విద్యార్థులు చెడలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ జి పద్మజ, మోహన్, లక్ష్మి , సూర్య కుమారి, రమాదేవి, ఏ లక్ష్మి , అరుణ టీచర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్వామీ విద్యానికేతన్ కరస్పాండెంట్ శ్రీమతి పాలూరి దేవి నిర్వహించారు విద్యార్థులకు బహుమతులు మెడల్స్ తో పాటు మిఠాయిలు పంచిపెట్టినట్లు తెలియజేశారు. ప్రధానంగా వచ్చిన అతిథులు అందరూ విద్యార్థులందరూ చిన్నప్పటినుండే వివిధ వ్యసనాలకు దూరంగా ఉండాలని సాధ్యమైనంత వరకు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని పదేపదే వక్కాణించటం జరిగినది అని ప్రిన్సిపల్ లక్ష్మణ్ స్వామి తెలియజేశారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం