చాలామంది భారతీయలు ప్రతి రోజూ తమ ఇళ్లల్లో పూజ చేస్తుంటారు. ఇంట్లో పూజ చేయడం అనేదిఒక పవిత్రమైన ప్రక్రియ. ఇద మనస్సుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మన జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతారు. అయితే పూజ చేసిన తర్వాత సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు కారణంగా దాని ఫలితాన్ని చాలామంది పొందలేకపోతుంటారు. కాబట్టి పూజ చేసిన వెంటనే చేయకూడని కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెంటనే కాళ్లు కడుక్కోవడం చాలామంది చేసే సాధారణ పొరపాట్లలో ఇదొకటి. పూజ చేసిన వెంటనే కాళ్లు కడుక్కోవడం వల్ల పూజ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కొంత సమయం వేచి ఉండి తర్వాత స్నానం చేయాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం ద్వారా పూజ పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ జీవితంలో శాంతిని, సంతోషాన్ని నింపుకోవచ్చు
ఎవరినీ శపించకూడదు పూజ తర్వాత ఎవరినైనా శపిస్తే అది మన జీవితంలోనే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మనం ఎవరినైనా శపించినా లేదా చెడుగా మాట్లాడిన పూజ యొక్క పవిత్ర శక్తిని నాశనం చేసినట్లే అవుతుంది. ఇది మన మానసిక శాంతిని కూడా దెబ్బతీస్తుంది. పూజ ద్వారా పొందిన సానుకూల శక్తిని శపించడం వల్ల కోల్పోతాము. కాబట్టి పూజ తర్వాత ఎవరినీ శపించకుండా, శాంతంగా,పాజిటివ్ గా ఉండటం చాలా ముఖ్యం. ఇది మనకు, ఇతరులకు మంచిని కలిగిస్తుంది.
మాంసం, మద్యానికి దూరం పూజ తర్వాత మనస్సు, శరీరం స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా అవసరం. మాంసం, మద్యం వంటివి తామసిక ఆహారాలు, ఇవి ఇవి మన మనస్సును భౌతిక విషయాలపై కేంద్రీకరిస్తాయి. పూజ తర్వాత ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పూజ పవిత్రతను కోల్పోతాం. మన సంస్కృతిలో, పూజ తర్వాత సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదిగా పరిగణించబడుతుంది.
జుట్టు,గోళ్లు కట్ చేయకడదు పూజ తర్వాత మన శరీరం, మనస్సు ఒక ప్రత్యేక శక్తితో నిండి ఉంటాయి. ఆ సమయంలో గోళ్ళు కట్ చేయడం లేదా జుట్టు కత్తిరించడంతో ఈ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. కొన్ని సంప్రదాయాలలో జుట్టు, గోర్లు ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా పరిగణించబడతాయి. పూజ తర్వాత వాటిని కత్తిరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతామని నమ్ముతారు
ప్రసాదం వెంటనే తినకూడదు ప్రసాదం అంటే దేవునికి సమర్పించిన నైవేద్యం. దీనిని దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు. ప్రసాదం తినడం వల్ల మనస్సు, శరీరం శుద్ధి అవుతాయని నమ్ముతారు. దేవునికి సమర్పించిన ప్రసాదాన్ని కొంత సమయం వేచి ఉన్న తర్వాత తినాలి. వెంటనే తినడం వల్ల దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
