July 1, 2024
SGSTV NEWS
CrimeNational

బావిలో పడ్డ పిల్లి రక్షించేందుకు వెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు మృత్యువాత

అహ్మద్‌ నగర్‌, ఏప్రిల్‌ 10: ఆ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బావిలో పడిన పిల్లిని కాపాడడే వారి పాలిట శాపమైంది. ఒకరిని కాపాడటానికి మరొకరు వెళ్లి వరుసగా ఐదుగురు యువ రైతులు మృతి చెందారు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 9) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణెకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలోని నెవాసా తాలూకాలోని వకాడి గ్రామంలోని పొలంలో పశువుల విసర్జనతో నిండిన  ఓ పాడుబడ్డ బావిని బయోగ్యాస్‌ కోసం వినియోగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఆ బావిలో ఓ పిల్లి అనుకోకుండా పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికులు పలు విధాలుగా ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి పిల్లిని కాపాడేందుకు నడుముకు తాడు కట్టుకొని బావిలోకి దూకాడు. అయితే అతడు బావిలో చిక్కుకుపోవడంతో అతడిని రక్షించేందుకు ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. వారిలో ఐదుగురు బావిలో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. అయితే ఓ వ్యక్తిని స్థానికులు ఎలాగోలా కాపాడగలిగారు. అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అహ్మద్‌నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ ఓలా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నెవాసా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ జాదవ్ తెలిపారు.
మృతి చెందిన ఐదుగురు వ్యక్తులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)లుగా గుర్తించారు. మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున బయటకు తీశారు.

Also read

Related posts

Share via