హైదరాబాద్ లో లవ్ జిహాద్ ముసుగులో జరిగిన ఒక దారుణమైన మోసం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నమ్మించి గొంతు కోయడమే కాకుండా, ఒక యువతి జీవితాన్ని సర్వనాశనం చేసిన నవాజ్ అనే వ్యక్తి దారుణాలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
నిందితుడు నవాజ్ తొలుత కూకట్‌పల్లి పరిధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడానికి వచ్చి, అక్కడ నివసిస్తున్న ఒక యువతిపై కన్నేశాడు. ఆమెను తన వలలో వేసుకోవడానికి పక్కా స్కెచ్ వేశాడు. తాను ముస్లిం అని తెలిస్తే ఆమె దూరమవుతుందని భావించి, తాను హిందువుగా మారినట్లు నాటకమాడాడు. యువతికి నమ్మకం కలిగించేలా ప్రవర్తించి, ఆమెను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే 2025 జూన్ నెలలో వీరిద్దరి వివాహం జరిగింది.
వివాహం అనంతరం ఈ జంట కూకట్‌పల్లి నుండి పంజాగుట్టకు మకాం మార్చారు. అయితే, పెళ్లయిన మొదటి రోజు నుంచే ఆ యువతికి అసలైన నరకం మొదలైంది. పెళ్లి రోజు రాత్రి (ఫస్ట్ నైట్) నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తే స్వయంగా ఈ ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
మానసికంగా, శారీరకంగా
నవాజ్ పెళ్లయిన తర్వాత ఆ యువతిని మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ప్లాట్‌ను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగక, ఆమె పేరు మీద బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. ఈ క్రమంలోనే బాధితురాలికి షాకింగ్ నిజాలు తెలిశాయి. నవాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తానూ అతని చేతిలో మోసపోయానని ఆమె గ్రహించింది. అంతేకాకుండా, నవాజ్ దేశవిదేశాల మధ్య అక్రమంగా సాగే హవాలా దందాల లో కీలక సూత్రధారి అని తెలుసుకుని ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించింది.
తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఘటనలు ప్రధానంగా పంజాగుట్ట పరిధిలో జరగడంతో ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు నవాజ్, అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక యువతిని ప్రేమ పేరుతో వంచించి, సామూహిక అఘాయిత్యానికి పాల్పడిన ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also read
- ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
- Astrology: వజ్ర యోగంతో ధన యోగం.. అదృష్ట దేవత తలుపు తట్టబోతున్న ఆ రాశుల వారు వీరే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు… రాజేంద్రప్రసాద్*
- ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. గురుడు టవర్ ఎక్కి ఏం చేశాడంటే..? వీడియో వైరల్..





