వైసీపీ నాయకుడి వేధింపులు తాళలేక తెదేపా నేత కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకొంది.
బాధితుడు టీడీపీ నాయకుడి కుమారుడు ఉపాధి పథకంలో అక్రమాలు వెలుగులోకి తెచ్చినందుకే కక్ష

బుక్కపట్నం, : వైసీపీ నాయకుడి వేధింపులు తాళలేక టీడీపి నేత కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకొంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. బుక్కపట్నం మండలం మారాల ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి ముఖ్య అనుచరుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడ్డాడు. రామ్మోహన్ చేసిన అక్రమాలను కొంత కాలం క్రితం టీడీపి నేతలు వెలుగులోకి తెచ్చారు. దీంతో అదే కాలనీకి చెందిన టీడీపి నాయకుడు నారాయణస్వామిపై రామ్మోహన్ కక్ష పెంచుకున్నాడు. గతంలో ఒకసారి నారాయణస్వామి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఈ నెల 1న పింఛన్ల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మారాలకు వచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకుడి దౌర్జన్యం గురించి బాధితుడు నారాయణస్వామి వారికి వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే విచారణ చేసి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో నారాయణస్వామి, అతని కుమారుడు గౌతమ్ శనివారం సాయంత్రం పోలీసు స్టేషన్ కు వెళ్లొస్తుండగా బుక్కపట్నం శివారులో కాపు కాచిన రామ్మోహన్, అతని అనుచరులు కేసు పెడితే అంతుచూస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన గౌతమ్ రాత్రి పుట్టపర్తిలోని తమ నివాసంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
కుటుంబసభ్యులు హుటాహుటిన అతణ్ని పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు
అక్కడి నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన చావుకు వైసీపీ నాయకుడు రామ్మోహన్, అతని అనుచరులు గోపి, ఓబుళప్ప, సన్నరాముడు, ప్రసాద్ కారణమని గౌతమ్ తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. రెండు ఘటనలపై బుక్కపట్నం, పుట్టపర్తి స్టేషన్ లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుణ్ని ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోన్ లో పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు అందించారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి