చంద్రగ్రహ జననం – 3*
*”అదేమిటి స్వామీ, అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !”*
*”సరే… ఈరోజు ఒక మేడ ముందు ఆగి, భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు ?”* ఉగ్రశ్రవుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు.
‘”ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు
*”కారణం !”* ఉగ్రుడు రెట్టించాడు. *”అది కలిగిన వారి ఇల్లులా కనిపించింది !”*
*”అవును…అయినా, ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది ! నిజంగా అది దోషమే స్వామీ !”* అంది శీలవతి.
*”కారణం చెప్తావా లేదా ?”* ఉగ్రశ్రవుడు గద్దించాడు.
*”ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామీ…” శీలవతి మెల్లగా అంది. “ఓహ్ ! మేడ మీద చందమామలా కనిపించింది, ఆ వేశ్య ముఖమన్నమాట !”* ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది.
*”…”*
*”ఓహ్ ! చంద్రబింబంలాంటి ముఖం ! మెరుపు తీగలాంటి శరీరం ! అప్సరస కాబోలనిపించింది, చూస్తుంటే…” ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు.
*”పోనివ్వండి, స్వామీ ! ఆమె అందంతో మనకు అవసరమేమిటి ?”* శీలవతి సౌమ్యంగా అంది. *”హాయిగా నిద్రపోండి !””
*”నాకు నిద్ర పట్టదు !”* ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. *”కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం వొంటికి పట్టేదాకా… నాకు నిద్ర పట్టదు !”*
*”స్వామీ…!”* శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది.
*”ఏం ? అంత ఆశ్చర్యపోతున్నావేమిటే! వేశ్యా సంగమం అంత కానిపనైతే… వేశ్యలు ఎందుకుంటారే ! నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు !”” ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు.
*”…”*
*”ఏం ? తీసుకెళ్ళలేవా ?”* ఉగ్రశ్రవుడు హూంకరించాడు. ‘”పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా ?”*
*”చివరిసారిగా చెప్తున్నాను ! నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్ళాల్సిందే ! మోసుకెళ్ళాల్సిందే !”*
*”స్వామీ… దయచేసి శాంతంగా వినండి…” శీలవతి దీనంగా అంది. “వేశ్యలు ధనం లేని వారిని గడప తొక్కనివ్వరు… మన వద్ద ధనం….”
*”లేదు – అది నాకు తెలుసు !”* ఉగ్రశ్రవుడు గర్జించాడు. “మన వద్ద ధనమే కాదు. ధాన్యం కూడా లేదు ! అలాగని పస్తులుంటున్నామా ? ఏం చేస్తున్నావ్ ? నన్ను ఆ బుట్టలో కూలవేసి ఎండలో ఎండిస్తూ, వానలో తడిపేస్తూ, కష్టపెడుతూ అడుక్కుతెస్తున్నావా లేదా ? అందర్నీ ధాన్య భిక్ష అడుగుతున్నావు ! ఆ వేశ్యను కూడా అడుగు ! ధనభిక్ష కాదు. ధాన్య భిక్ష కాదు. ‘ప్రణయభిక్ష’ అడుగు ! నీ పతి దేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్ధించు !”*
*”స్వామీ…!”* శీలవతి నివ్వెరపోతూ అంది.
*”ఏమే ? స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరదే పిచ్చిదానా ! నన్ను ఆ సౌందర్యరాశి ఇంటిముందుకు తీసుకెళ్ళు. దాని కాళ్ళు పట్టుకో. కన్నీళ్ళు పెట్టుకో. ‘భిక్షం’ సంపాదించు. లే !బుట్ట తే !!**
*”నా… ఆలోచన వినండి స్వామీ…” శీలవతి ప్రాధేయపడుతూ అంది. “”మీ ఆరోగ్యం బాగాలేదు. లేవలేని స్థితిలో ఉన్నారు….”
*”నోర్ముయ్ ! నిన్ను చూస్తూ ఇలా ఉండచుట్టుకుని పడి ఉన్నాను ! అంతే ! ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవే !” అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి. మొహంలోకి చూశాడు. *”నేను రోగిష్టినయితేనేం ? చెప్పానుగా ! కాళ్ళు పట్టుకో ! కన్నీళ్లు పెట్టుకో ! కావాలంటే రేపూ మాపూ బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో ! పద !”*
మంచం అంచుకి ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ, శీలవతి బుట్ట అందుకుంది. ఉగ్రశ్రవుణ్ణి బుట్టలోకి చేర్చి, ఆ బుట్టను తలమీదకి ఎత్తుకుంది. ఇంట్లోంచి అవతలకి నడిచింది…
శీలవతి భర్తను మోసుకుంటూ, చీకట్లో ఊరివైపు నడుస్తోంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ, వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో చెప్తున్నాడు.
చీకట్లో శీలవతి నడకసాగుతోంది.
బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది.
*”అబ్బా !” అంది తీరని బాధతో ఒక పురుష కంఠం.
శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తోంది.
*”నరకయాతన అనుభవిస్తున్న నన్ను తాకి, కదిలించి ఆ బాధను ఇనుమడింపచేసిన వారు ఎవరో – సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది ఈ మాండవ్య మహర్షి శాపం !”” ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది.
*”నా కాలు ఎవరికో తాకింది !” ఉగ్రశ్రవుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది ! ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా ?…”
శ్రీ గురు దత్తా
సేకరణ… ఆధురి భాను ప్రకాష్