నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం
మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహానికి తల లేదు, చేతుల వేళ్లు సగం వరకు తెగి ఉన్నాయి. మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి పక్కన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వివస్త్రగా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీఎన్ఏ పరీక్షలకు చిక్కకుండా..!
నేరస్థులు తమ ఆచూకీ లభ్యం కాకుండా ఉండేందుకే ఆమె చేతి వేళ్లు నరికేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాడినప్పుడు ఆమె చేతి వేళ్ల గోళ్లలో వారికి సంబంధించిన ఆధారాలు చిక్కే అవకాశం ఉంటుందని.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే బండారం బయటపడుతుందని అనుమానించి దుండగులు నరికేసి ఉంటారని పేర్కొంటున్నారు.
Also read
- Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
- వికారాబాద్లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!
- ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి
- ఆర్థిక ఇబ్బందులతో ఎస్సై బలవన్మరణం
- కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్





