తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.
ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!